Sunday, April 18, 2010

one day..............

భానుని కిరణాలు కిటికిలోంచి ఇంట్లో కి పడుతున్నవేల లేరా కిర్రు.. అన్న అమ్మ పిలుపుతో మొదలైన రోజు.92.7 fm లో కౌసల్య సుప్రజా రామ .. వింటూ sleep well పరుపు నుండి దిగి తాగినవాడి వలె నడుస్తూ colgate paste తో ముఖం కడుక్కొని తొందరలో 3 roses tea తో మూతి కాల్చుకొని lifebuoy soap స్నానం చేసి ambica darbarbathi తో దేవుని ఆరాదించి సద్ది కట్టుకొని మాడిపోయిన పెసరట్టు తిని clg dres code తో (bata shoe) livya bag మోసుకుంటూ మొదలవుతుంది నా ప్రయాణం ...........

ముఖం వెంట మూసి నదిలా ప్రవహిస్తున్న చెమటను తుడుచుకుంటూ..280 no bus కోసం నా కండ్లు పండు లు ఐన తర్వాత , వరద బాదితులు తిండి పోట్లలకై ఎగబడినట్లు ఎక్కు జనాల్ని తోసుకుంటూ ... పాస్ बतावो అన్న మాటకు బాధపడుతూ .. ఎవడు seat లోంచి లేస్తాడా ఆని ఎదురు చూస్తూ.. ఘాటైన ఎండలో ఘటకేసర్ లో దిగిన వేల holy mary .. holymary.. అన్న auto వాడి పిలుపులకై ఆత్రంగా వెళ్తూ.. 7 seats auto లో ఎడుచుకుంటూ ... వాడికి 7 rs ఇచ్చి y.s పాదయాత్రను తలుచుకుంటూ... సాగే 1 km పయనం గంగిరెద్దు మేడలో గంటలా id వేలాడుతున్నప్పుడు clg లో ఆడుగు పెట్టి ....గంట గంట కు atendence తో అవస్థలు పడుతూ .. power పాయిన powerpoint లతో సాగే class లు వింటూ ......
lunch కోసం కళ్ళు కాచేలా ఎదురుచూస్తూ... 16 రుచుల బెంచి బోజనాలు చేస్తూ ... మళ్ళి మొదలయ్యా ఏంట్రా బాబు ఆనుకుంటూ..కళ్ళు మూసుకొని కుంభకర్నుడిలా కూని రాగాలు తీస్తూ కలలో కూడాతలచుకుంటూ.. నాలుగు కోసం వాచీని తిడుతూ..హమ్మయ్య గడిచిపాయిందిర బాబు అనుకుంటూ వచ్చిన దారి లోనే చచ్చినట్టు ఇంటికెళ్ళి ......శ్రీనాథ కవి రేంజ్ లో ఆసైన్మెంట్ రాస్తూ..ఏదో ఎంత తినేసి వార్తలు చూస్తూ బతుకు బండిని ఈడుస్తూ... నిద్దుర లోకి పోయేన క్షణం ...లేరా కిర్రు... తో మళ్ళి మొదలవుతుంది....................

Thursday, April 15, 2010

ప్రేమా...? దోమా...?

బెల్లం లాంటి నీ తీపి మాటల కోసం చీమలా...
జల ధార లాంటి నీ నవ్వు కోసం దాహం తీరని కాకిలా..
గంగాప్రవాహం లాంటి నీ హృదయ తరంగాలలో చేపలా..
నాగుపాము లాంటి నీ జడ కోసం డేగ లా ...
మకరందం లాంటి అందం కోసం సీతాకోకచిలుకలా..
నీ నిశ్వాసను ఆస్వాదించే వేణువులా....
నీ నూరేళ్ళ జీవితపు దీపానికి చమురులా..
నీకోసం జీవిస్తాను .......
ప్రేమా అంటూ దోమ లా నీ చుట్టూ తిరుగుతున్న నన్ను..
నీ నుండి ఏ మస్కిటో కోయిల్ నన్ను వేరు చేయలేదు... ప్రియతమా...
.

ఓ ప్రియతమా.................

వర్షపు బిందువు కోసం ఎదురుచూసే బీడు భూమి లా..
వసంతం కోసం వేచే కోయిల లా.....
హరివిల్లు లాంటి ఈ రంగుల ప్రపంచంలో ...
నీ నిశ్వాసకై విశ్వాసంతో శ్వాసిస్తున్న ....
(ఇంకా ఉంది....)

Tuesday, April 13, 2010

సంధ్య సమయంలో సముద్ర తీరం వెంబడి వీచే చల్లని పవనాలు
పరిమళం పూసుకున్న గులాబీ సువాసనలు
ఆపశ్రుతి లేని కోయీల కృతులు
అమ్మ చేతి గోరుముద్దలు
చూపుడు వేలుతో ప్రపంచాన్ని చూపిన నాన్న ఆడుగుజాడలు
మర్చిపోలేని తీపి జ్ఞాపకాల నీడలు
స్నేహమనే దారిలో మనం నడిచే ఈ ఆడుగులు ............
ఇవన్నీ మతిమరపే మనల్ని మర్చిపోయేలా చేస్తాయి.........
.......
మా చందు గాడి గురించి
చందు ....... ఓ .... చందు.........
స్నేహ బావముండు నీ నందు
నీ మాటలే మాకు పసందు
నువ్వు నడుస్తుంటే తరించును మీ సందు
ఎంతో తెలివి కలదు నీ యందు
అందరికి నువ్వొక ఆప్తబందు
ఆపదల్లో మాకిస్తావ్ ఓదార్పు మందు
అందరికంటే నువ్వుండాలి ముందు
ఈ ఘనతంతా నీ కే చెందు
ఇక ఉంటారా ! చందు...........................
నా స్నేహాస్య తవికలు ............
౧.ఒరేయ్ సిద్దు............
నువ్వోస్తావ్ ముద్దు.............
మన స్నేహానికి ఉండదు హద్దు.......
విడిపోవడమే వద్దు........
చేయకు నా కవిత రద్దు....
మన స్నేహం ఏప్పటికి
కుక్కకి కట్టిన గొలుసుల............
పందికి అంటిన బురదల........
అడుక్కొనే వాడి చిప్పలా....
నూతిలో ఉన్నల కప్పలా......
చేపకున్న మొప్పలా........
ఉప్పులేని పప్పులా...............
తెగిన చెప్పులా..................
రావణ కాష్టం లోని నిప్పులా.................
తీర్చలేని ఆప్పుల............
మంచి కాఫీ కప్పుల............
కలకాలం ఉండాలని ఉండాలని కోరుకుంటూ ..................
నీ ప్రాణ మిత్రుడు,
కిరణ్

Saturday, April 10, 2010