Saturday, July 31, 2010

నా ప్రాణం

స్నేహమంటే....
మతం  కాదోయ్ ..
కులం కాదోయ్ ...
మెప్పుకాదోయ్ .. తప్పుకాదోయ్..
తీసుకొనే ఆప్పుకాదోయ్ ..
జాతిబేధం చూపుతున్న నీతిలేంది కాదు కాదోయ్...
మంచులా కరిగిపోయే సంపద మాత్రం కాదు కాదోయ్ ....  || స్నేహమంటే||
స్నేహమంటే......
మామా అంటూ బాబాయ్ అంటూ పిలుచుకునే పిలుపు కాదోయ్
స్వార్థం కోసం సాయమడిగే స్వబావమే కాదు కాదోయ్
స్నేహం పేరుతో ప్రేమించే ద్రోహం కాదోయ్ మొహం కాదోయ్
పరిధి దాటినా చేష్టలతో చేసే ర్యాగింగ్ మాత్రం కాదు కాదోయ్
సందు దొరికితే మందు తాగే విందు కాదోయ్ పసందు  కాదోయ్...
డబ్బు కోసం మోసం చేసే జబ్బు మాత్రం కాదు కాదోయ్..
కలిసి కాలేజీ ఎగ్గొట్టే బంక్  కాదోయ్..
విరిగిపోయే పెంకుముక్క కాదు కాదోయ్....
అర్థం లేని ఆపార్ధం కాదోయ్...
నీటిమీద రాత కాదోయ్...
నిలిచిపోయే వాత లాంటిదేనోయ్...
స్నేహమంటే....
త్యాగమేనోయ్...

Thursday, July 22, 2010

ఓడిన ఓటమి..

నీలోనే  విజయాల గని ఉందిగా ....
నీ ప్రతి అడుగు చేరాలి గెలుపుకు దగ్గరగా....
సంద్రంలా కదలా లోయి ...
గగనాన్ని తాక లోయి .....
గెలిచే వరకు ఒక సమరం చేయాలోయి....
ప్రతి ఉదయం నువ్వే కాగా...
ఉదయించాలి భానుడి లాగా.....
చేసుకోవాలి ప్రతి ఓటమిని చేసుకో.. మెట్ల లాగా...
ఎదగాలి... ఎవరెస్ట్ లాగా...
నీతో నీకే యుద్ధం...
సంకల్పాన్నే చేసుకో ఆయుధం......
కాలాన్ని తీసుకో ఆదర్శం...
వెనుకకు చేయకు  దర్శనం...
నీలో రగలాలి నీ లక్ష్యం రైల్ engine లో బొగ్గులా....
రగిలే నిప్పుల వెలుగులే చూపును నీకు దారి....
కావాలి నీ మార్గం అందరికీ  పయనించే దారి..
తుది శ్వాస వరకు  నీ ఆశలే నీకు కావాలి శ్వాస....
.










.

Monday, June 28, 2010

నేనెవరంటే....!!!!!!!!!


ఒక్కోసారి ఏడవకున్న  వస్తావు ...
ఒక్కోసారి ఎంత ఏడ్చిన  రావు...
 ఒకరిని బాదిస్తావు  ....
మరొకరి బాద తీరుస్తావు...
కొందరిని నవ్విస్తావు...
మరెందరినో కరిగిస్తావు... 
ఎక్కడినుండి వస్తావు నువ్వు...
మాతో  జన్మిస్తావు...
మమ్మల్ని ఒంటరిగా పంపిస్తావ్...
మేము పోయాక  విజ్రుమ్బిస్తావ్..
బాగా నవ్వినా వస్తావ్...
నే కోరను నిన్నెప్పుడు ....
 కానీ  వస్తావా నాకోసం అప్పుడప్పుడు......

 

.

Sunday, June 20, 2010

.7 న్నవే.... ఎలుక ..

గత  రెండు ఏండ్లుగా  మా ఇంట్లో  మాతోనే  కలిసిమెలిసి జీవిస్తూ...
మా కష్టసుఖాలను  పంచుకుంటూ... శబరీ లా  ముందే   మేము తినే బియ్యని  రుచిచుసే నువ్వు, కీచ్ కీచ్ మనే  నీ నవ్వు, లేక  నీ పరుగుల వాళ్ళ కల కళకళ  లాడే మా ఇల్లు బోసీ పోయింది. ఎలుక ధీర లాగా . 100 మహా మహా గ్రందాలను సైతం   ఒకేసారి ఔపోసన పట్టే సామర్థ్యం గల నువ్వు  ఎక్కడికి వెళ్ళావ్... నువ్ రోజు తినే ratkiller  breakfast    నీ కోసమే ఎదురుచూస్తుంది...మా ముద్దు చిట్టి ఎలుక మాపై నీకెందుకు ఈ ఆలక ....
శత్రు మార్జాలు(cats ) నీపై  దాడిచేసాయ....? అసంభవం శతద్రు ఎలుక వంశయోదునికి పరభావమా .... ఎంత మాట ఎంత  మాట ......
 నీ రాకకై మా కండ్లు కాయలు కాసి తర్వాత పండ్లై రాలిపోయీ  కుల్లిపోడానికి సిద్దంగా ఉన్నాయ్
 దీని జాడను తెలిపిన వారికీ తగినే శిక్ష  ఇవ్వబడును.
దీని గుర్తులు...
కలర్ : పెన్సిల్ లెడ్
షర్టు ప్యాంటు  ఏం వేసుకోడు..
వయసు  వచ్చే ఆగష్టు కి సరిగ్గా ౩ సం ||
కీచ్ కీచ్ ఆని మాత్రమే  మాట్లాడగలదు..
వెనుక తెగిన తోక ఉండును.
                                             ఇట్లు
                               భూమి  రాముని తమ్ముడు

Tuesday, June 8, 2010

అమ్మ........

తను  తిన్న  అన్నం  ఎక్కడ లోపల ఉన్న తన బిడ్డకు అడ్డుతగులుతుందేమోనని వాంతి చేసుకుంటుంది  తల్లి....... అక్కడ మొదలవుతుంది  మనందరి జీవితం......
మన కోసం తనకు అతి ఇష్టమైనవి కూడా తినకుండా ....తను వేసే ప్రతి అడుగు కష్టమైనా,  లోపల మన అడుగుల తడబడులకు మురిసిపోతూ ... మనకోసమే ఎదురుచూస్తూ .... 9  నెలలు  రోజు రోజుకీ పెరిగే బరువును మోస్తూ ....తను బ్రతికుంటానో  లేదో  అన్నది  పట్టించుకోకుండా ..మనల్ని 
కనడానికి వెళ్తుంది operation theatre లోకి....అది అమ్మంటే ......
కనులు తెరిస్తేనే జననం .... 
  మనం ఏడుస్తున్నప్పుడు  అమ్మ  నవ్వే ఒకే ఒక సందర్బం  మన జననం ...
తల్లి హృదయం ఫై  తల్లి గుండెచప్పుడు చెపుతుంది ఎలా  జీవితం లో ఆడుగులు వేయాలని...
అమ్మ ఎత్తుకున్నపుడు  తను విడిచే గాలి మనకు ఆయువిచ్చే ప్రాణవాయువవుతుంది ...
చల్లని వెన్నెలలో  పిలిచినా రాదని తెలిసిన చందమామ  ను మనకోసం పిలుస్తూ .... తన చేతి వేళ్ళనుండి  మన నోట్లోకి వెళ్తున్న ప్రేమతోకూడిన  గోరుముద్దలు  తలుచుకుంటే  అప్పుడే తిన్న ఎవ్వరికైనా మళ్లీ ఆకలవుతుంది...
తొందరగా ఎదగాలని స్నానానికి ముందు గట్టిగా వళ్ళంత రాసే తైలం నొప్పులు ఇప్పటికి మర్చిపోలేం ...
దిష్టి చుక్క పెట్టేటప్పుడు  అమ్మ నోటివెంట వచ్చే శబ్దం రుబ్బు రోరుల తిరుగుతున్న మన తలను గట్టిగా అదిమిపట్టుకోని  , చుక్క వంకర పోతే అమ్మ కళ్ళలోని కోపం   ఆహ......
మొదటిసారి బోర్ల పడ్డప్పుడు అమ్మ కళ్ళలోని ఆనందం ....
పక్కతడిపి నపుడు   వచ్చే ప్రేమకలిగిన కోపం...
అంబాడుతు  తన దగ్గరికి వెళ్ళినపుడు  టక్కున ఎత్తుకున్నప్పుడు 
ఎత్తుకో అని రెండు చేతులు పైకెత్తి  ఏడ్చినపుడు...... 
                                                      (సశేషం )
 

Monday, May 31, 2010

నీ నవ్వు ....

ఒక రోజు నవ్వుకు పెద్ద కష్టం వచ్చిపడింది .....తనను తనే వెతుక్కుంటూ వెళ్ళింది .....
ఎక్కడా ఎవ్వరిదగ్గర లేదు.....
తనలాగే కనిపిస్తున్న తను కాదు...
నవ్వుకు ఇక కోపం వచ్చింది ...
తనను తానే మర్చిపోయింది ....
అనుకోకుండా ఒక రోజు నిన్ను చూసింది ...
నీదగ్గర తనను తానే కలుసుకుంది..
తనకంటే నీధగ్గరున్న తను (నవ్వు) బావుంది...
తనను అందరికి పంచివ్వమని అడిగింది ...
ఈ రోజుతో నవ్వు బాధ పోయింది...
ఎప్పుడు ఎక్కడా చూసినా తానే...
తను నీ దగ్గరుంటే అందరి దగ్గర ఉన్నట్ట్టే...

Saturday, May 8, 2010

నా నీడలా వెంటాడే 4 సంii తీపి జ్ఞాపకాలను చీకటి లాంటి కాలగమనం  నా నుండి నీడను వేరు చేస్తుందా? లేదు   కిరణం లాంటి వెలుతురు ఎన్నడు నీడను వీడదు