Tuesday, June 8, 2010

అమ్మ........

తను  తిన్న  అన్నం  ఎక్కడ లోపల ఉన్న తన బిడ్డకు అడ్డుతగులుతుందేమోనని వాంతి చేసుకుంటుంది  తల్లి....... అక్కడ మొదలవుతుంది  మనందరి జీవితం......
మన కోసం తనకు అతి ఇష్టమైనవి కూడా తినకుండా ....తను వేసే ప్రతి అడుగు కష్టమైనా,  లోపల మన అడుగుల తడబడులకు మురిసిపోతూ ... మనకోసమే ఎదురుచూస్తూ .... 9  నెలలు  రోజు రోజుకీ పెరిగే బరువును మోస్తూ ....తను బ్రతికుంటానో  లేదో  అన్నది  పట్టించుకోకుండా ..మనల్ని 
కనడానికి వెళ్తుంది operation theatre లోకి....అది అమ్మంటే ......
కనులు తెరిస్తేనే జననం .... 
  మనం ఏడుస్తున్నప్పుడు  అమ్మ  నవ్వే ఒకే ఒక సందర్బం  మన జననం ...
తల్లి హృదయం ఫై  తల్లి గుండెచప్పుడు చెపుతుంది ఎలా  జీవితం లో ఆడుగులు వేయాలని...
అమ్మ ఎత్తుకున్నపుడు  తను విడిచే గాలి మనకు ఆయువిచ్చే ప్రాణవాయువవుతుంది ...
చల్లని వెన్నెలలో  పిలిచినా రాదని తెలిసిన చందమామ  ను మనకోసం పిలుస్తూ .... తన చేతి వేళ్ళనుండి  మన నోట్లోకి వెళ్తున్న ప్రేమతోకూడిన  గోరుముద్దలు  తలుచుకుంటే  అప్పుడే తిన్న ఎవ్వరికైనా మళ్లీ ఆకలవుతుంది...
తొందరగా ఎదగాలని స్నానానికి ముందు గట్టిగా వళ్ళంత రాసే తైలం నొప్పులు ఇప్పటికి మర్చిపోలేం ...
దిష్టి చుక్క పెట్టేటప్పుడు  అమ్మ నోటివెంట వచ్చే శబ్దం రుబ్బు రోరుల తిరుగుతున్న మన తలను గట్టిగా అదిమిపట్టుకోని  , చుక్క వంకర పోతే అమ్మ కళ్ళలోని కోపం   ఆహ......
మొదటిసారి బోర్ల పడ్డప్పుడు అమ్మ కళ్ళలోని ఆనందం ....
పక్కతడిపి నపుడు   వచ్చే ప్రేమకలిగిన కోపం...
అంబాడుతు  తన దగ్గరికి వెళ్ళినపుడు  టక్కున ఎత్తుకున్నప్పుడు 
ఎత్తుకో అని రెండు చేతులు పైకెత్తి  ఏడ్చినపుడు...... 
                                                      (సశేషం )
 

3 comments:

  1. "తను తిన్న అన్నం ఎక్కడ లోపల ఉన్న తన బిడ్డకు అడ్డుతగులుతుందేమోనని వాంతి చేసుకుంటుంది తల్లి".... ఏం చెప్పారండీ, మీ ఊహ అమోఘం!

    ReplyDelete
  2. తల్లి పిల్లలని కనేటప్పుడు పడే భాధని కష్టాని ఊహి౦చి చాలా చక్కగ వివరి౦చారు.
    తల్లి ప్రేమ గురి౦చి చాలా బాగా వ్రాశారు.


    తెలుగు బ్లాగర్ల ప్రప౦చ౦లో అడుగుపెట్టాను
    ఇది నా బ్లాగు చూడ౦డి.
    http://seshuviews.blogspot.com/

    ReplyDelete
  3. "తను తిన్న అన్నం ఎక్కడ లోపల ఉన్న తన బిడ్డకు అడ్డుతగులుతుందేమోనని వాంతి చేసుకుంటుంది తల్లి" Beautiful thought!

    ReplyDelete